Natyam ad

ఎయిడ్స్ సోకిన చిర్నారులతో కలెక్టర్ అల్పాహారం

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఎయిడ్స్ సోకిన చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.తద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా అందరితో సమానమేనని చాటిచెప్పారు. విశాఖ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం సమానత్వం అనే నినాదంతో ఎయిడ్స్ దినోత్సవం జరుగుతున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 8,900 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉండగా.. వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ అందిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా హెల్పింగ్ సొసైటీ ఏర్పాటు చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ సంస్థల నుండి విరాళాలు సేకరించి హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లకు సహాయం అందజేస్తామన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున తన ఒక నెల జీతాన్ని చెక్కు రూపంగా సొసైటీకి అందజేశారు.

 

Tags: Collector breakfast with AIDS infected children

Post Midle
Post Midle