Natyam ad

పుంగనూరులో జగనన్న గృహాలను పరిశీలించిన కలెక్టర్‌ హరినారాయణ్‌

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సుగాలిమిట్టలో జరుగుతున్న జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్‌ హరినారాయణ్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణాల నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నేతిగుట్లపల్లెలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటిలో జరుగుతున్న అర్భన్‌ హెల్త్ సెంటర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆరడిగుంట వద్ద ఇండస్ట్రియల్‌ ఏరియా ప్రాంతంగా గుర్తించడాన్ని పరిశీలించారు. ఈయన వెంట ఎంపీడీవో రామనాథరెడ్డి, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఎస్టీమానటరింగ్‌ కమిటి సభ్యుడు డాక్టర్‌ మునీంద్రనాయక్‌, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Collector Harinarayan inspected Jagananna’s houses in Punganur

Post Midle