జగనన్న కాలనీ శంఖుస్థాపన కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్‌ హరినారాయణ్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో జూన్‌ 3న శంఖుస్థాపన చేయనున్న హౌసింగ్‌ కాలనీ ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ పరిశీలించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌ జహ్నవి, జేసి వీరబ్రహ్మం కలసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ మున్సిపాలిటిలో లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేసిన లేఔట్లు గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 3న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో శంఖుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1.74 లక్షల గృహ నిర్మాణాలకు శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.పుంగనూరులో 1638 మందికి స్థలాలు పంపిణీ చేశారు. అలాగే 1500 మందికి గృహలు పంపిణీ చేయనున్నారు. ఈయన వెంట హౌసింగ్‌ పీడి పద్మనాభన్‌, డీఈ నరసింహాచారి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Collector Harinarayan inspected the Jagannath Colony foundation stone laying activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *