Collector inaugurates Kovid Test Center at RTC Depot

 ఆర్టీసీ డిపోలో కోవిద్  పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ 

Date:17/10/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ని శనివారం జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు శనివారం తనిఖీ చేశారు. ఆర్.టి.సి. బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు కోవిడ్ 19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి, బస్టాండ్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ అన్ లాక్ నిబంధనలు సడలించిన తర్వాత ఆర్.టి.సి బస్సుల ద్వారా జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రయానించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. దీనివలన కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు,బస్సులలో ప్రయాణించే సమయంలో అనుమానం ఉంటే, వెంటనే నెల్లూరు ఆర్.టి.సి బస్టాండ్ లోని ఈ కేంద్రంలో పరీక్ష చేయించుకోవచ్చన్నారు. దీనివల్ల కోవిడ్ వ్యాప్తి నగరాల నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి నగరాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. ఆర్.టి.సి. బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రయాణికులు కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాజ్యలక్ష్మి , ఆర్.టి.సి ఆర్.ఎం పి.వెంకటశేషయ్య, ఆర్.డి.ఓ  హుస్సేన్ సాహెబ్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

22 వ డివిజన్ షార్ కాలనీలో పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Tags:Collector inaugurates Kovid Test Center at RTC Depot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *