నేటి నుంచి సెలవులో కలెక్టర్‌ అమ్రపాలి

Collector is Amrapali from today

Collector is Amrapali from today

Date:15/02/2018

వరంగల్ ముచ్చట్లు:

వరంగల్ అర్బన్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ దయానంద్‌, రూరల్‌ ఇన్‌చార్జిగా జేసీ హరిత
కలెక్టరేట్‌(వరంగల్‌ అర్బన్‌): వరంగల్‌అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి గురువారం నుంచి సెలవుల్లో వెళ్లనున్నారు. ఈ నెల 18వ తేదీన తన వివాహం ఢిల్లీకి చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో జరుగనుండటంతో ఈ నెల 15నుంచి మార్చి 7వ తేదీ వరకు సెలవుల్లో వెళ్తున్నారు. 16నుంచి 21వరకు జమ్ముకాశ్మీర్‌లో, 22నుంచి 25వరకు హైదరాబాద్‌లో, 26న వరంగల్‌ను సందర్శిస్తారు. అనంతరం మార్చి 7వ తేదీ వరకు టర్కీలో పర్యటించి 8న విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌ అమ్రపాలి వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ఆమె సెలవుల్లో వెళ్తుండటంతో అర్బన్‌ జేసీ దయానంద్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా, రూరల్‌ జేసీ హరిత వరంగల్‌రూరల్‌ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.

 

Tags: Collector is Amrapali from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *