ఆర్టీసీ బస్సాండ్ ను పరిశీలించిన కలెక్టర్

బోథ్ ముచ్చట్లు:

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  రాష్ట్ర ప్రభుత్వం మహిళలను దృష్టిలో ఉంచుకొని కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు మంగళవారం బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఎంత మేరకు బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుతున్నారనే విషయాన్ని సంబంధిత కంట్రోలర్ రాజేశ్వర్ రెడ్డి, బస్సు కండక్టర్ ను అడిగి తెలుసుకున్నారు ప్రజలు ప్రభుత్వం కల్పించిన అవకాశం వినియోగించుకోవాలని కోరారు ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు ఆయన వెంట స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్ ఉన్నారు

Tags:Collector who inspected RTC Bussand

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *