గుట్టలో రెండు పథకాలను ప్రారంభించిన కలెక్టర్

భువనగిరి ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు గ్యారెంటీ పథకాలను నేడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్య శ్రీ,మహాలక్ష్మి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబా  చేతుల మీదుగా ప్రారంభించారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రెండేటిని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

 

Tags:Collector who started two schemes in Gutta

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *