కడపలో కలెక్టరేట్ ముట్టడి
కడప ముచ్చట్లు:
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.దీంట్లో బాగంగా కడపలో ఉపాద్యాయ సంఘాల ఆందోళనలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, హెచ్‌ఆర్ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు.ప్రభుత్వ విడుదల చేసిన జీవోలతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Collectorate siege in Kadapa