పుంగనూరు ముచ్చట్లు:
విద్య సమస్యలు పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి మున్న తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ , గురుకుల , కెజివిబి హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, తల్లికి వందనం, విద్యాదీవెన , వసతి దీవెన తక్షణమే చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లలో వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేపట్టామన్నారు. ఈ ముట్టడి కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై , జయప్రదం చేయాలని కోరారు.
Tags; Collectorate siege on 6