కలెక్టరేటు ముట్టడి

భవనగిరి  ముచ్చట్లు:
రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా రెండు లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ పిలుపునిచ్చారు అందులో భాగంగానే  మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కలెక్టరేట్ వద్ద పోలీసు ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కూడా బారికేడ్ లను దాటుకొని కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చిన వెళ్లిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. బారికేడ్ లను దాటుకొని కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష పోస్టులను భర్తీ చేయడంతోపాటు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని… లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Collectorate siege

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *