కిర్రాక్ తో కాలేజీ రోజులు గుర్తొచ్చాయి

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
‘హ్యాపీడేస్’ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న హీరో నిఖిల్. ఆ తరవాత కొన్ని సినిమాలు నిఖిల్‌ను సక్సెస్ నుంచి వెనక్కి నెట్టాయి. దీంతో తన పంథా మార్చుకున్న నిఖిల్.. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సస్ సూర్య’, ‘శంకరాభవరణం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘కేశవ’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలు చేశాడు. దీంతో నిఖిల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్‌లోని స్టార్ యంగ్ హీరోల్లో ఒకడిగా నిఖిల్ దూసుకెళ్తున్నాడు. తాజాగా ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.‘హ్యాపీ డేస్’ తరవాత నేను చేసిన పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇదే. కాబట్టి ఇది నాకేంతో ప్రత్యేకం. ఈ సినిమా నాకు కెరీర్ పరంగా బాగా సహాయపడుతుందని అనుకుంటున్నాను. ఇది నా 15వ సినిమా. ప్రతి సినిమా విడుదలకు ముందు నాలో కొంత కంగారు మొదలవుతుంది. నా ప్రతి సినిమా విడుదలప్పుడు నాకు తొలి సినిమా ఫీలింగే కలుగుతుంది.‘కిరాక్ పార్టీ’ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. అంతేకాకుండా ఇంజినీరింగ్ అంటే సాధారణమైపోయిన ఈ రోజుల్లో.. నిరుద్యోగ సమస్య ఎలా ఉందో సినిమాలో చూపించాం. దానితో పాటు ఒక అమ్మాయి గురించి చేసే చెడు కామెంట్లు భవిష్యత్తులో ఆమెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి వంటి అంశాలను కూడా చూపించాం. ఈ సినిమాలో అవే నాకు బాగా నచ్చాయి.మెడీ సీన్స్, ఐటమ్ సాంగ్ తీసేశాం..
కన్నడ ‘కిరిక్ పార్టీ’కి ఈ సినిమాకు పెద్దగా తేడాలేం ఉండవు. కన్నడ సినిమా మూడు గంటలపాటు నడుస్తుంది. కానీ తెలుగులో రెండున్నర గంటలకు కుదించాం. మనకు అవసరంలేని కొన్ని కామెడీ సన్నివేశాలు, ఐటమ్ సాంగ్ తొలగించాం.
అది రూమరే..
నిర్మాత అనిల్ సుంకర దర్శకత్వ విభాగంలో తలదూర్చారనడంలో నిజం లేదు. నాకు తెలిసి ఆయన సినిమాకు కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, ఆ తరవాత మధ్యలో ఒకసారి మాత్రమే సెట్స్‌కు వచ్చారు.
పెళ్లి చేసుకోవాలనే ఉంది..
కెరీర్ ఇంత బాగా సాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తున్నా. ఇంట్లో అమ్మా నాన్న కూడా తొందరపెడుతున్నారు. నాకూ చేసుకోవాలనే ఉంది. పెళ్లి చేసుకొని త్వరగా పిల్లలను కనేసి వారిని ఎత్తుకుని ముద్దాడాలని ఉంది. చెప్తే నవ్వుతారేమో కానీ.. నాకు కూతురు పుడితే ఏ పేరు పెట్టాలో కూడా ఎప్పుడో నిర్ణయించేశా. మా పాపకి ‘మాయ’ అని పేరు పెడుతా. చూద్దాం.. టైమ్ వస్తే పెళ్లి ఆగదు కదా..!
పోలీస్ స్టేషన్‌కు వెళ్లా..
కాలేజీ రోజుల్లో ఒకట్రెండు సందర్భాల్లో గొడవల్లో ఇరుక్కున్నాను. అప్పుడు పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లిన అనుభవాలున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ అని పోలీసులే దయతలిస్తే ఇంటికొచ్చేవాళ్లం. కాబట్టి ‘కిరాక్ పార్టీ’ చూస్తే కుర్రాళ్లకి కాలేజీ రోజులు గుర్తొస్తాయి.
Tags: College days with Kirrak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *