కాలేజీ అమ్మాయిలే టార్గెట్ 

Date:15/02/2018
వరంగల్ ముచ్చట్లు:
హెరిటేజ్‌, స్మార్ట్‌సిటీగా పేరొందిన వరంగల్‌ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఒకప్పుడు కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ తంతు ఇప్పుడు నగరానికి పా కింది. కొందరు మహిళలు, పురుషులు, పోలీసు, రాజకీయ పలుకుబడితో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారు. సులభంగా, డబ్బు సంపాదించాలనే అత్యాశతో అడ్డదారి తొక్కుతున్నారు. విలాసవంతమైన భవనాల్లో కాలనీవాళ్లకు అనుమానం రాకుండా ఎంచక్కా కథను నడిపిస్తున్నారు. ఇంటికే విటులను రప్పించి మ హిళలను ఎరవేస్తున్నారు. పోలీసుల భయంతో పర్మినెంటుగా మహిళలను ఉంచకుండా అప్ప టికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా విటుల కోరిక మేరకు హాస్టల్‌ అమ్మాయిలను కేటాయిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్‌ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్‌ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను ఉచ్చులోకి లాగుతున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని ఎంపిక చేసిన వ్యక్తులతో కొంత సమయం గడిపితే తోటి విద్యార్థుల కం టే లగ్జరీగా బతకవచ్చనే ఆశలు చూపిస్తున్నా రు. హన్మకొండ, వరంగల్‌, కాజీపేట ప్రాంతాలలో కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థల సమీపంలో ఉన్న బాలికల హాస్టల్స్‌ వీరికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతున్నాయి. సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై కాలేజీ అమ్మాయిలను తీసుకెళ్లి మర్నాడు తెల్లవారక ముందే హాస్టళ్లకు కొంత దూరంలో దింపి వెళుతున్నారు. ఈ మేరకు అమ్మాయిలకు రోజుకు రూ.500, రూ.1000 ఇస్తూ నిర్వాహకులు మాత్రం రూ.2 నుంచి 4వేల వరకు సంపాదిస్తున్నారు.
నగరంలోని సంపన్నవర్గాలు ఉండే కాలనీలలో ఈ వ్యభిచార గృహాలు ఎవరికి అనుమా నం రాకుండా నిర్వహిస్తున్నారు. ఉన్నత కు టుంబాలను నమ్మిస్తూ ఇల్లు కిరాయికి తీసు కుంటున్నారు. తమ కుటుంబ యజమాని విదేశాల్లో ఉన్నారని నమ్మబలుకుతూ నెలకు రూ. 10నుంచి 20వేల వరకు అద్దె చెల్లిస్తూ గుట్టుచప్పుడు కాకుండా విటులను ఫోన్‌ల ద్వారా రప్పించుకుంటున్నారు. ముందుగా విటులకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో మహిళల ఫొటోలు పంపిస్తారు. ఆపై విటులకు అమ్మాయిలను కేటాయిస్తారు. విటులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మధ్యవర్తులే సమకూర్చుతున్నారు. పోలీసులకు సైతం అనుమానం రాకుండా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండే అపార్ట్‌మెంట్లలోనే ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో వ్యభిచార గృహాలు యథేచ్ఛగా నడుస్తున్నా.. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరికట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలని పసిగట్టడంలో టాస్క్‌ఫోర్స్‌, పోలీసు నిఘావ్యవస్థ వైఫల్యం చెందుతున్నాయని పలువురు అంటున్నారు. కేవలం గుట్కాలు, బెల్టుషాపులలో మద్యం అమ్మకాలను నియంత్రించడాకే టాస్క్‌ఫోర్స్‌ పరిమితం అవుతున్నదని అంటున్నారు. నగరంలో చాలాచోట్ల చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని కేసులను పట్టుకోగా పోలీసు ఉన్నతాధికారులే విడిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అమాయక అమ్యాయిల జీవితాలను కాపాడాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.అసాంఘిక కార్యకలాపాలకు నగర సమీపంలోని కొన్ని గెస్ట్‌హౌస్‌లు, రిసా ర్ట్స్‌ వేదికగా చేసుకుంటున్నారు. ప్రయాణికులు రద్దీగా ఉండే ప్రదేశాల్లో లాడ్జీ లు, హైఫై హోటళ్లలో యథేచ్ఛగా వ్యభిచారం సాగుతోంది. హన్మకొండ బస్‌స్టేషన్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎంజీఎం జంక్షన్‌, బట్టలబజార్‌, కేయూ జంక్షన్‌, సుబేదారి, అడ్వకేట్స్‌కాలనీ, వడ్డెపల్లి, సహకారనగర్‌, కేయూ, హసన్‌పర్తి, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్‌, కాజీపేట, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారగృహాలు నడుస్తున్నట్టు సమాచారం. వరంగల్‌ మహానగరంలో సు మారు వందచోట్ల ఇలాంటి రహస్య స్థావరాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.
Tags: College girl is Target

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *