Natyam ad

శునకాలను దారుణంగా కాల్చి చంపిన కాలేజీ యాజమాన్యం

రాజానగరం ముచ్చట్లు:

తూర్పుగదావరి జిల్లారాజానగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజి సమీపంలో దారుణం జరిగింది. నోరు లేని మూగజీవాలు పై దారుణంగా నాటు తుపాకుల తో కాల్చి చంపుతున్న వైనం బయటపడింది. ఇప్పటివరకు సుమారు 30నుండి 50 కుక్కల వరకు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన వాటిని బైక్ కు కట్టి ఇడ్చుకెళ్తున్న కొందరు వ్యక్తులను  జంతు ప్రేమికులు నిలదీసారు. రాజానగరం జగన్నాధపురం లోని అగ్రహారం మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంపస్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. స్థానిక రాజానగరం పోలీస్ స్టేషన్ లో జంతు ప్రేమికులు ఫిర్యాదు చేసారు. శునకాలను చంపిన వారు కోరుకొండ కు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు,  ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

 

Tags: College management who brutally shot dogs

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.