మామిడి ఆకులపై ఘర్షణ..వ్యక్తికి గాయాలు

Date:18/01/2021

మేడ్చల్  ముచ్చట్లు:

మేడ్చల్ జిల్లా ఉప్పర్ పల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం చిలిచిలికి గాలివానగా మారింది. సత్తిరెడ్డి, విరస్వామి కుటుంబాల మధ్య మామిడి చెట్టు ఆకులు పడ్డాయనే విషయంలో ఇంట్లో ఆడవారి మధ్య వివాదం తలెత్తింది. అయితే విరస్వామి కూతురు గీత తన తల్లి ఇంటికి ఫోన్ చేసి తన తమ్ముళ్లు వారి అనుచరులతో కలిసి సత్తిరెడ్డి పై మూకుమ్మడి దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయాలై తల పగిలిన సత్తిరెడ్డిని హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు మద్యం, గంజాయి సేవించి ఎందరు ఆపినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Collision on mango leaves..injuries to person

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *