ప్రజల గుండెల్లో కల్నల్ సంతోష్

సూర్యాపేట  ముచ్చట్లు:
గాల్వన్ లోయలో డ్రాగన్ దేశ ముష్కరుల దాడిలో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబు భౌతికంగా దూరమై ఈ ఏడాది పూర్తయినా…. దేశ ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారని సంతోష్ బాబు సతీమణి సంతోషి అన్నారు. కల్నల్ సంతోష్ బాబు వీర మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం మహా వీర చక్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం, నగదు, ఇంటి స్థలం, ఇచ్చి గౌరవించడం మర్చిపోలేనని సంతోషి అన్నారు. ఎవరు ఎన్ని ఇచ్చినా తన భర్త భౌతికంగా తమ దగ్గర లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలోపు సూర్యాపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి, విగ్రహా ఆవిష్కరణకు వస్తున్న కేటీఆర్ కు సంతోష్ బాబు సతీమణి సంతోషి ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ కొరకు చైనా సరిహద్దులో కల్నల్ సంతోష్ బాబు చూపించిన తెగువ అందరికీ స్ఫూర్తిదాయకమని…. ఆ స్ఫూర్తితో యువత దేశ రక్షణలో పాలుపంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Colonel Santosh in the hearts of the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *