Natyam ad

తపాల శాఖ, రైల్వే సంయుక్త సర్వీసులు

ముంబై ముచ్చట్లు :


తపాలా శాఖ అందించే సేవలకు రైల్వే రవాణాను అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారులకు పూర్తిస్థాయిలో పార్శిల్ సర్వీస్‌ను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముందుడుగు వేసింది. దీనిలో భాగంగా పోస్టల్‌శాఖ సహకారంతో ఇంటివద్దకే నేరుగా పార్సిల్‌ను చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులతో రైల్వే అధికారులు సమావేశం నిర్వహించారు. రైల్వే, తపలా శాఖలు సంయుక్తంగా రవాణా వనరులను ఉపయోగించుకొని పార్సిల్ రవాణా చేసే వినియోగదారులకు సంపూర్ణమైన సేవలను అందించడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. రైల్వే, పోస్టల్ సేవలు రెండింటినీ ఏకీకృతం చేయడం వలన ప్రజలు తమ తమ గమ్యస్థానాలకు రవాణా చేయాలనుకుంటున్న పార్శిల్ వస్తువులను డోర్ స్టెప్ పికప్, డెలివరీని సమర్ధవంతగా నిర్వహించడంలో సహాయపడుతుందన్నారు. దేశంలోని ప్రతి మూలకు సామాన్య ప్రజలు తమ ఇంటి వద్ద కూర్చొని సౌకర్యవంతంగా సరుకులను బుక్ చేసుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తక్కువ పరిమాణంలో వస్తువులు, ఉత్పత్తులు బుక్ చేయాలనుకునే వినియోగదారులకు ఈ సేవలు దోహదపడతాయన్నారు.

 

 

 

రైల్వేల ద్వారా రవాణా చేయడం వల్ల వారి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో పాటు సురక్షితంగా, వేగంగా సకాలంలో చేరేలా చేస్తుందన్నారు.ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, ఈ సమీకృత సదుపాయంతో వినియోగదారులు తమ వస్తువులను ఇళ్లనుండే పార్శిల్ రవాణా చేసుకొనే సౌలభ్యం తో పాటు అత్యంత సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో సురక్షితమైన పద్ధతిలో బుక్ చేసుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు. తపాలా శాఖ సహాయంతో బుకింగ్, డెలివరీ సేవలను అందించడంతో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పార్సెల్ ప్రత్యేక రైళ్లలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఇది దోహదపడుతుందన్నారు.చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కె.ప్రకాశ్ మాట్లాడుతూ రెండు సంస్థలు కలిసి ముందుకు రావడం వల్ల మెరుగైన సేవలను అందిచబడతాయన్నారు. గ్రామాల్లోని వినియోగదారులకు కార్గో సేవలు అందించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయన్నారు.

 

Post Midle

Tags: Combined services of Postal Department and Railways

Post Midle