శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి- మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీ

-సి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో  ఆహ్వానం

తిరుమల ముచ్చట్లు:

ముంబై లో  టీటీడీ నిర్మించనున్న  శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి   దేవేంద్ర ఫడ్నవీస్ లను టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఈవో  ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు .         ఈ మేరకు శనివారం ఉదయం వీరు ముంబైలో సిఎం , డిప్యూటీ సి ఎం లను కలిశారు . వేద పండితులు  షిండే , ఫడ్నవీస్ కు వేద ఆశీర్వచనం చేశారు . చైర్మన్ ,ఈవో  శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు . ఆగస్టు 21వ తేదీ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . సి ఎం ,డిప్యూటీ సి ఎం  ఇద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు .       ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం  టీటీడీ కి 10 ఎకరాల భూమి అప్పగించింది . రేమండ్స్ కంపెనీ అధినేత  గౌతం సింఘానియా ఈ  భూమి లో  స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .

 

Tags: Come for Bhoomi Pooja of Srivari Temple- Maharashtra CM, Deputy

Leave A Reply

Your email address will not be published.