Natyam ad

 పల్లీల కోసం వచ్చి 

గుంటూరు ముచ్చట్లు:

పల్లీల కోసం వచ్చాడు. పాతిక వేలు నొక్కేశాడు. అంతే కాదు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో సైతం చిక్కుండా అక్కడ నుంచి జారుకున్నాడు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితురాలు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే అతను 332కనిపించకుండాపోయాడు. చివరకు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగిన చోరీ ఘటన ఆసక్తిగా మారింది. స్థానికంగా ఉన్న దుకాణంలో ఒక వ్యక్తి పల్లీలు కోసం వచ్చాడు. మొదట పల్లీలు కావాలంటూ మాటలు కలిపిన అతను తర్వాత చాలా సరకులు తీసుకున్నాడు. అయితే అనుకోకుండా తన ఫోన్ ఇంట్లో మరచిపోయానంటూ దుకాణంలో ఉన్న యజమానురాలి ఫోన్‌ అడిగాడు. సరకులను ప్యాకింగ్ చేసే పనిలో ఉన్న ఆమె తన ఫోన్‌ను అతనికి ఇచ్చింది. దానికి లాక్ ఉండటంతో మరలా అతను ఆ ఫోన్‌ను ఆమెకు ఇచ్చేశాడు. బిల్లు ఇవ్వడానిక తన వద్ద డబ్బులు లేవంటూ మరోసారి ఆమె ఫోన్ కావాలని అడిగాడు. అయితే పనిలో బిజిగా ఉన్న ఆమె ఎదో ధ్యాసలో పడి ఫోన్ లాక్ తీసి అతనికి ఇచ్చింది. కాసేపటికే ఆమె ఫోన్ ఇచ్చేశాడు. ఎవరూ లిప్ట్ చేయటం లేదని చెప్పాడు. ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకు వస్తానంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవదిలోనే ఫోన్‌లో గూగుల్ పే నుంచి 25వేల రూపాయలు నగదు డ్రా అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఖంగుతింది.బాధితులు వెంటనే తేరుకొని అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే అతను ఎస్కేప్ అయ్యాడు. చుట్టు పక్కల వారు కూడా అలర్ట్ అయ్యి సమీప ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో దుకాణంలో ఉన్న సీసీ కెమెరాతోపాటుగా, చుట్టు పక్కల ఉన్న మరో సీసీకెమెరాల్లో సదరు వ్యక్తి ఆచూకి కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

 

 

అతను ప్లాన్ ప్రకారం సీసీ కెమెరాలకు దూరంగా మెలిగాడని గుర్తించారు. మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌లో గూగుల్ పే ద్వారా చేసిన ఆర్దిక లావాదేవీలకు సంబందించిన నెంబర్ గుర్తించారు. అయితే అది కూడా స్విచ్ ఆఫ్ అని రావటంతో,పోలీసులు సాంకేతిక పరిజ్ణానం ద్వారా కేసు ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసి ఫోన్‌లో ఉన్న నగదును కోట్టేశాడంటే, అతను తెలిసని వ్యక్తి అయ్యి ఉండాలని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా రెక్కి నిర్వహించుకొని మరీ చోరీకి పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి… వాటిని ఎలా తప్పించుకోవాలని కూడా ప్లాన్ వేసుకుని మరీ చోరీకి పాల్పడ్డాడు. ఫోన్ లాక్‌ను దుకాణంలోని మహిళతోనే తీయించి, అదే ఫోన్ ద్వార 25వేల రూపాయలు నోక్కేయటంతో పాటుగా అక్కడ నుంచి రెప్పపాటులో మాయం అయ్యాడంటే ముందుగా ఏదైనా వాహనాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు మరో వ్యక్తి సహకారం కూడా ఉండి ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ పై ఫింగర్ ప్రింట్లను కూడ పోలీసులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

 

Post Midle

Tags: Come for the parishioners

Post Midle