Come on duty from tomorrow

రేపటి నుంచి విధులకు రండి..ఉద్యోగులకు టీటీడీ ఆదేశం

Date:03/05/2020

తిరుమల ముచ్చట్లు:

టీటీడీలో పరిపాలన కార్యక్రమాలు రేపటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ నిభందనతో మూసి వేసిన టిటిడి పరిపాలన కార్యలయంలో రేపటి నుంచి పరిపాలన యథావిధిగా ప్రారంభం కానుంది. అత్యవసర విభాగాలలో వంద శాతం హజరు కావాలంటూ అధికారులు ఉత్తర్వులు జారి చేసినట్టు సమాచారం. మిగిలిన విభాగాలలో 33 శాతం హజరు కావాలని ఆదేశించారు. దీంతో సుధీర్ఘకాలం స్తంభించిన టీటీడీ పరిపాలన రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 24వ తేది నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో టిటిడి కూడా ప్రభుత్వం ఆదేశాలు మేరకు అత్యవసర విభాగాలుకు మినహా మిగిలిన వారికి వర్క్ ప్రం హోం వెసులు బాటు కల్పించింది.

 

 

మరో వైపు శ్రీవారి ఆలయంతో పాటు టిటిడి అనుభంద ఆలయాలులో కూడా దర్శనాలు నిలిపివెయ్యడంతో టిటిడిలో పరిపాలన స్తంభించింది. దీంతో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 41 రోజులు పాటు టిటిడి పరిపాలనా భవనంలో కార్యకలాపాలు లేకూండానే సాగింది. రెండో దశ లాక్ డైన్ విధించిన సమయంలో ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వడంతో టిటిడి పరిపాలనా కూడా ప్రారంభించేందుకు సిద్దమైనా. టిటిడి పరిపాలనా భవనం వున్న ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో వుండడంతో చివరికి టీటీడీ వెనక్కి తగ్గింది. అయితే చిత్తురు జిల్లా రెడ్ జోన్ పరిధిలో వున్నా టిటిడి పరిపాలనా భవనం వున్న ప్రాంతం ఇప్పుడు గ్రీన్ జోన్ గా మారడంతో….. పరిపాలన కార్యలయంలో తిరిగి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమవుతు ఉత్తర్వులు జారి చేసింది టిటిడి.

ఏపీ సర్కారుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

Tags: Come on duty from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *