లేపాక్షి ఉత్సవాలకు రండి…

Date:27/03/2018
అనంతపురం ముచ్చట్లు:
హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తెలుగువారందరికి ఆహ్వానం పలికారు. తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని కోరారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ వీడియో విడుదల చేశారు. లేపాక్షి ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రజలందరికి స్వాగతం, సుస్వాగతం. లేపాక్షి ప్రాచుర్యం ఎంత గొప్పదో… అందరికి తెలుసు. అందుకే ప్రభుత్వం అద్భుతమైన ఉత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఒక తెలుగు పండుగలా నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఉత్సవాలకు రమ్మంటూ నందమూరి బాలయ్య ఆహ్వానం పలికారు. మార్చి 31, ఏప్రిల్ 1… రెండు రోజులపాటూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా సాంస్తృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. వందలాదిమంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఉంది.
Tags:Come to Lepakshi festivals …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *