పుంగనూరులో కృష్ణాష్టమి వేడుకలకు రండి – పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ సమీపంలోని కృష్ణమరెడ్డిపల్లె వద్ద గల శ్రీ కృష్ణ ఆలయంలో శుక్రవారం నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలకు ప్రతి ఒక్కరు తరలిరావాలని పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆయన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్య యాదవ్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణాలయంలో యాదవ్‌ సంఘం ఆధ్వర్యంలో స్వామి వారిని పట్టణ పురవీధులలో ప్రదర్శన చేస్తామన్నారు. దేవరెద్దులు, పిల్లనగ్రోవినృత్య ప్రదర్శన, శ్రీకృష్ణ వేషదారణలో సుందరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణాష్టమి వేడుకల్లో ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా హాజరై, వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Come to Punganur for Krishnashtami celebrations – PKM UDA Chairman Venkata Reddy Yadav

Leave A Reply

Your email address will not be published.