Natyam ad

జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

– సిఎం కు టీటీడీ చైర్మన్, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు ఆహ్వానం

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్‌   వైవి సుబ్బారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి గురువారం ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.
తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రిక అందజేశారు.జూన్‌ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు  జగన్మోహన్ రెడ్డికి వివరించారు.జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చైర్మన్   వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు.

Tags:Come to Srivari Temple Mahasamprokshan in Jammu

Post Midle