భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

తిరుపతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి  వై ఎస్ .జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్  వైవి .సుబ్బారెడ్డి,భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌  వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి , వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.మే 21 వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో  గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి పాల్గొన్నారు.

 

Tags:Come to the Mahasamprakshan of Bhubaneswar Srivari Temple

Leave A Reply

Your email address will not be published.