Natyam ad

పోలింగ్‌కు రండి…రెండు ఓట్లు ఫ్యాన్‌కు వేయండి -ఎంపీ మిధున్‌

-ఉదయాన్నే పోలింగ్‌ జరిగేలా చూడండి
– పిల్లలతో సరాదాగా

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఈనెల 13న జరగనున్న ఎన్నికలలో ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు పోలీంగ్‌ కేంద్రానికి వచ్చి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని ఓటర్లను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి అభ్యర్థించారు. శనివారం ఆయన పట్టణంలో పోలింగ్‌ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు. ఎంపీ మాట్లాడుతూ ఎండ తీవ్రత ఉన్న కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండ ఉదయం నుంచే పోలింగ్‌ సక్రమంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం కుటుంబ సభ్యులు, పిల్లలతో సరదాగా గడిపారు. ఎంపీ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండ ఉండాలన్నారు. ఓటర్లకు మోడల్‌ ఈవిఎంలను చూపి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఓటరును పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. వృద్దులు, వికలాంగులు, గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి, వేయించి , అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగనన్న రెండవ సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టేలా ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి పాల్గొన్నారు.

Tags; Come to the polls…cast two votes for the fan – MP Midhun

Post Midle