పుంగనూరులో 14న యాదవుల ఆత్మీయ సభకు తరలి రండి
పుంగనూరు ముచ్చట్లు :
వైయస్సార్సీపీ యాదవుల ఆత్మీయ సమావేశం ఈనెల 14న పుంగనూరులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పికేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి యాదవుల ఆత్మీయ సమావేశానికి సుమారుగా 10,000 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ , అటవీ, పర్యావరణ, గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ,రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ,మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ,చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప , రాజ్యసభ సభ్యులు భేదా మస్తాన్ యాదవ్ తో పాటు రాష్ట్రంలోని యాదవ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజా ప్రతినిధులు ,నామిటెడ్ పదవుల్లో ఉన్న ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి యాదవులకు రాష్ట్రంలో అనేక పదవులు ఇచ్చి, వారి అభివృద్ధి కృషి చేశారని తెలిపారు. ఈ సమావేశంలో యాదవుల ఐక్యతలు చాటుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం జరుగుతుందన్నారు .జిల్లాలోని యాదవులు అందరూ తప్పక సమావేశానికి హాజరై ,యాదవ ఐక్యమత్యం చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

Tags:Come to Yadavs Atmiya Sabha on 14th at Punganur
