స్వల్ప గాయాలతో బయటపడ్డ కమేడియన్ పవిత్ర

హైద్రాబాద్ ముచ్చట్లు:

జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ నెల 11న సొంతూళ్లో ఓటు వేసేందుకు వెళుతుండగా ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో పవిత్ర బయటపడింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందు టైర్ ఊడిపడిపోవడంతో పాటు పలు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ.. ప్రాణాలతో బయటపడతాననే నమ్మకం కలగలేదని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. పలు టీవీ షోలు, సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ నెల 11న ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి తన సొంతూరు సోమశిలకు కారులో బయలుదేరింది. ఆమెతో పాటు బంధువులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో నెల్లూరు ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వచ్చే మరో కారు వీళ్ళ కార్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు పవిత్ర కారు ముందు టైరు ఊడిపడిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి కారు దూసుకెళ్లింది. సమయానికి ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పిందని, చిన్న గాయాలతో బయటపడ్డానని పవిత్ర తెలిపింది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు మాత్రం నాశనమైపోయిందని చెప్పింది.

 

Tags: Comedian Pavitra survived with minor injuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *