Date:03/12/2020
చెన్నై ముచ్చట్లు:
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ ముందే ఇచ్చేశారు.. రాజకీయ పార్టీపై ట్విట్టర్ వేదికంగా తలైవా క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేశారు. జనవరిలో పార్టీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.. డిసెంబర్ 31న పార్టీ వివరాలు ప్రకటిస్తామన్నారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు.సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత నేరుగా తన నివాసం పోయెస్ గార్డెన్‌కు చేరుకున్న రజినీ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. మక్కళ మండ్రంలోని లోటుపాట్ల గురించి చర్చించినట్టు తలైవా వివరించారు.రజనీకాంత్ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇప్పుడు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.ముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ సంచలన ప్రకటన చేసారు. తాను కొత్త పార్టీ పెడుతున్నా అని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. రజనీ ఫాన్స్ కి ఆయన న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. డిసెంబర్ 31 న పార్టీ వివరాలను వెల్లడిస్తా అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీపై ఆయన ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేసేసారు. అయితే ఆయన పార్టీ పేరు మాత్రం ఇంకా ప్రకటించలేదు.జనవరి నుంచి తన పార్టీ రంగంలోకి దిగుతుంది అని ఆయన స్పష్టం చేసారు. 2021 ఎన్నికల్లో తాను పోటీ చేస్తా అని ఆయన స్పష్టం చేసారు. ఎప్పటి నుంచో రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. బిజెపిలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది.
మీ కోసం ప్రాణాలు అర్పిస్తా
రజనీ కాంత్ ఈ పేరు తెలియని భరతీయులు ఉండరనడంలో అతిశయోక్తేమీ లేదు. రజనీ కాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే అతడి కబాలీ సినిమాకు పెద్దపెద్ద సంస్థల సైతం ఉద్యోగులకు సెలవులు ఇచ్చి మరీ సినిమా చూసుకోమని చెప్పాయి. ఆ తరువాత తమిలనాడు రాజకీయాల్లోకి రజనీ అరంగేట్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతని అభిమానులుఎప్పుడెప్పుడు రాజనీ పార్టీ పెడతాడా అని ఎదురు చూశారు. ఇటీవల రజనీ తన ట్విటర్ ద్వారా తన కొత్త పార్టీ ప్రకటన గురించి తెలిపారు. తాను ఫేమ్ కోసమో, డబ్బుకోసమో రాజకీయాల్లోకి రావట్లేదని రజనీ ఇంతకు ముందే ఎన్నో సార్లు తెలిపారు. తన పార్టీకి సంబంధించిన సమాచారాన్ని డిసెంబరు 31న ప్రకటిస్తానని, పార్టీను మాత్రం వచ్చే ఏడాది జనవరీలో స్థాపిస్తామని రజనీ ఓ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2021 ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ప్రజా గళమై అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే రజనీ పార్టీను పెడుతున్నారని అంటున్నారు. ఈ వార్త తమిళనాడు రాజకీయ పార్టీలలో పెన సంచలనంగా నిలిచింది. దీనిపై ఎవరు ఎలా స్తందిస్తారో చూడాలి. రజనీ పార్టీకు తమిళ ప్రజల ఆదరణ పూర్తి స్థాయిలో ఉంది.
దాదాపు నాలుగేళ్లుగా ఆయన అభిమానుల ను పార్టీ పేరు చెప్పి వూరిస్తూనే ఉన్నారు.అయిదారు నెలల తర్వాత తొలిసారి ఆయన ఇపుడు బయటకు వచ్చారు.ఈ మధ్యలో ఆయనకు కొద్ది సుస్తీ కూడా చేసింది.ఇపుడు ఆరోగ్యం కుదుట పడగానే హుటాహుటిని అందరిని రమ్మని పిలుపునీయడంతో ఆయన ఏదో కీలకమయిన ప్రకటన చేయబోతున్నారని అనుకున్నారు.38 జిల్లాల కార్యదర్శులతో రజినీకాంత్ ప్రస్తుతం చర్చలు జరిపారు. ఆయన రాజకీయ ఆరంగ్రేటం పై కీలక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు.. మీరు పార్టీ పెడితే మీ వెంట నడుస్తానని సంఘాల నేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం అందుతోంది. జిల్లాకార్యదర్శులంతా సమావేశానికి వచ్చారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి వాళ్ల వాళ్ల అభిప్రాయలు వ్యక్తం చేశారు.నేనూ నాఅభిప్రాయాలు చెప్పాను. నేను ప్రకటించే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.రాజకీయప్రవేశం మీద తొందర్లోనే నిర్ణయం ప్రకటిస్తాను,’ అని పోయెస్ గార్డెన్ నివాసంలో విలేకరులకు చెప్పారు.ఒకవేళ మీరు బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడవలేమని అభిమాన సంఘాల నేతలు పేర్కొన్నట్లు చెప్పినట్లు సమాచారం
ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఆయన ఎపుడో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించారు. తొందర్లో ప్రకటన అన్నారు. ఆ ప్రకటన ఇంతవరకు వెలవడ లేదు. మొదట్లో పరిస్థితి అనుకూలంగా లేదన్నారు. ఆరోగ్య కారణాలున్నారు. 2016లో ఆయనకు రీనల్ ట్రాన్స్ ప్లాంట్ జరిగింది. తర్వాత కోవిడ్ వచ్చింది. ఈరెండు కారణాల వల్ల ఇప్పట్లో రాజకీయకలాపాలుప్రారంభించడం కష్టమన్నారు. ఈ మధ్యలో ఆయన ఏకంగా బిజెపిలోనే చేరతారని పుకారు కూడా వచ్చింది.పార్టీ పెట్టే సమయం ఆసన్నమయిందని, ఇక ఆయన వెనక్కు పోలేరని, కచ్చితంగా తొందర్లోనే తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తారని చెన్నైలో చాలా మంది భావిస్తున్నారు.ఏప్రిల్ 2021 నాటికి…అంటే తమిళనాడు సాధారణ ఎన్నికలకు ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే రజనీకాంత్ సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టినా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని డీఎంకే భావిస్తుంది. రజనీకాంత్ ను పార్టీ పెట్టకుండా డీఎంకే అన్ని విధాలుగా అడ్డుకుంటుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ పార్టీ పెడితే అది అధికార పార్టీ కంటే డీఎంకే కంటే ఎక్కువ నష్టమని అంచనాలు ఉండటంతో డీఎంకే ఈ విధమైన ప్రచారం
మొదలుపెట్టింది.అయితే తనను ఎవరూ బెదిరించలేదని, బెదిరించబోరని రజనీకాంత్ తన అభిమానులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సమయం వచ్చినప్పుడు పార్టీని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఇక రజనీకాంత్ పార్టీ పెడుతున్నారని, అందులోకూటమిలో చేరతామంటూ పీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. తమకు ఎక్కువ స్థానాలను కేటాయించకపోతే రజనీ వైపు వెళతామని కొన్ని పార్టీలు బ్లాక్ మెయిల్ కు కూడా దిగాయి.
పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Coming ne- Rajini given by Clarity