14న ‘స్మారిక’పుస్తకావిష్కరణ సభ

కడప ముచ్చట్లు:

యోగి వేమన విశ్వవిద్యాల యం అధీనంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ‘స్మారిక’ (కట్టా నరసింహులు జీవిత, చారిత్రక, సారస్వత సౌరభాలు) పుస్తకావిష్కరణ సభను ఈనెల 14 ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రౌన్‌ శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ కేంద్రం బాధ్యులు డా  మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్‌   కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్‌ కట్టా నరసింహులు జీవిత, చారిత్రక, సారస్వత సౌరభాలను వెదజల్లే ఈ ప్రత్యేక సంచిక తమ కేంద్రం ఆధ్వ ర్యం లోరూపొందించబడిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, పుస్తకావిష్కర్తగా యోవేవివి ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, సభాధ్యక్షులుగా ప్రముఖ అవధానకవి డా నరాల రామారెడ్డి (ప్రొద్దుటూరు), విశిష్ట అతిథిగా యోవేవి ఆచార్య దుర్భాక విజయ రాఘవప్రసాద్‌, గౌరవ అతిథిగా స్టెప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా  వల్లూరు బ్రహ్మయ్య, ఆత్మీయ అతిథులుగా కట్టా  మిత్రులు పుత్తా పుల్లారెడ్డి, కట్టా కుమారుడు డా  కట్టా లక్ష్మీ నరసింహము (తిరుపతి), పుస్తక పరిచయకర్తగా శతావధాని ఆముదాల మురళి (తిరుపతి) పాల్గొంటారని మూల మల్లి కార్జున రెడ్డి చెప్పారు దీంతో పాటు తాను  సభా నిర్వహణ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా  బంధువులు,  ఆత్యీయులు,  మిత్రులు,  శిష్యులు పాల్గొంటారని అన్నారు.

 

Tags: ‘Commemorative’ book launch meeting on 14th

Leave A Reply

Your email address will not be published.