కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రారంభం-జిల్లా కలెక్టర్ జి. రవి

Date:16/01/2021

జగిత్యాల ముచ్చట్లు:

సమస్త మానవాలిపై ప్రబావం చూపుతున్న కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోనెల ప్రవేశపెట్టిన వ్యాక్సిక్ పంపిణి కొరకు జిల్లాలో అన్నివసతులతో వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  శనివారం జగిత్యాల ప్రదాన ఆసుపత్రి మరియు కోరుట్ల మండలం లోని సమాజిక ఆసుపత్రిలో వ్యాక్సిక్ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించుకోగా,  జిల్లా ప్రదాన ఆసుపత్రిలో నిర్వహించిన ప్రారబోత్సవం కార్యక్రమంలో పాల్గోన్నారు.  ఈ  సందర్బంగా కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రిలొ ఏర్పాటుచేసి తద్వారా దేశప్రదాని నరేంద్రమోది గారి ప్రసంగాన్ని విక్షించారు. అనంతరం జగిత్యాల శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో కలిసి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా ప్రదాన ఆసుపత్రిలో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం సందర్బంగా జిల్లాలో మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ వర్కర్ లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఆంగన్వాడి, ఎఎన్ఎం సిబ్బంది సుమారు 6వేల మందిని ఎంపిక చేసుకోవడం జరిగిందని,  కార్యక్రమ ప్రారంబోత్సవం సందర్బంగా జిల్లా ప్రదాన ఆసుపత్రి, కోరుట్ల సిహెచ్సి లను సిద్దంచేసుకోని వ్యాక్సిన్ అందించే ప్రక్రియను ప్రారంభించుకోవడం జరిగిందని పేర్కోన్నారు.  ఇదివరకే  జిల్లాలో 26 కేంద్రాలలో డ్రైరన్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని లోటుపాట్లను సరిదిద్దుకొని పూర్తిసిద్దంగా ఉన్నామని అన్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 2 చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని, ప్రభుత్వం తదుపరి ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కేంద్రాలను సోమవారం నుండి ఎర్పాటు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నామని పేర్కోన్నారు.    ఈ రోజు 30మందికి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుందని పేర్కోన్నారు.

 

 

 

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఆదుకోందని,  లాక్డౌన్ సమయంలో పనుల కొరకు పక్కరాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వారికి రేషన్ బియ్యం అందించడంతో పాటు ప్రతిఒక్కరికి ఐదువందల రూపాయలను ఇచ్చి  ప్రభుత్వం ఆదుకుందని అన్నారు.    జిల్లా యంత్రంగాం కోవిడ్ సెంటర్ ఏర్పాటుచేసుకొడం జరిగిందని,  జగిత్యాలలో కరోనా వచ్చిన దాని నుండి సమర్దవంతంగా ఎదుర్కోంటు ప్రజల్లో ఆత్మస్థైర్మాన్ని పెంపొందించేలా జిల్లా ప్రదాన ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు. మానవునిపై కరోనా వైరస్ ఏవిధంగా ఆదిపత్యం చేలాయిస్తుందో, దానిని దీటుగా ఎన్నో ప్రయోగాలను విజయవంతం చేసుకోని కరొన వ్యాక్సిన్ ను తీసుకురావడం జరిగిందని పేర్కోన్నారు.   కరోనా సమయంలో సేవలు అందించిన  వైద్యసిబ్బంది, పారిశుద్ద్య కార్మికుల సేవలు మరువలేవని వారందరికి మొదటగా వ్యాక్సిన్ అందించుకోవడం జరుగుతుందని, తదనంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు విడతల వారిగా వ్యాక్సిన్ అందచేయడం జరుగుతుందని పేర్కోన్నారు.
జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లడుతూ,

 

 

 

 

చైనా దేశం ఉహన్ నగరం నుండి ఈ కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది ఇబ్బందులకు గురైనారని, కరోనా బారినుండి రోగనిరోదక శక్తి పెంచి, శరీరంలో యాంటిబాడిస్ పెంచేవిధంగా శాస్త్రవేత్తలు కృషిచేసి కరోనా వ్యాక్సిన్  తయారు చేయడం జరిగిందని అన్నారు.  అందులో బాగంగా అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా మరియు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి వారి ఆస్ట్రాజెనికా, భారతదేశానికి చెందిన శ్రీరాం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా, తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్ మరియు మరికోన్ని సంస్థలు వాక్యిన్ తయారుచేస్తున్నారని అన్నారు.   భారతదేశంలో మొదటగా 3కోట్లమందికి వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమానికి ఎర్పాట్లుచేయడం జరిగిందని,   ప్రదానమంత్రి  ఆదేశాల మేరకు కరోనాపై చెప్పినట్లు చేయడం జరిగింది.  తప్పకుండా ఇంకా బౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమనిబందనలు పాటించాలని సూచించారు.

 

 

 

ప్రజలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని,  కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకండా ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.  జాతీయ కార్యక్రమంగా గుర్తించి తగిన కార్యక్రమాలను నిర్వహించుకోనులే చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముందుగా శాంతి జయసుధ స్టాఫ్ నర్స్ లకు వ్యాక్సిన్ అందించేశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో  వైద్యాధికారులు, వైద్య సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది ,స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Commencement of Kovid Vaccination Centers-District Collector G. Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *