కాకాణి చేతుల మీదుగా వై.యస్.ఆర్.వాహన మిత్ర కార్యక్రమం ప్రారంభం

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో “వై.యస్.ఆర్.వాహన మిత్ర” పథకాన్ని  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.తోటపల్లిగూడూరు మండలంలో వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకం కింద 2270 మంది ఆటో యజమానులకు 10 వేల రూపాయల చొప్పున 2 కోట్ల 27 లక్షల రూపాయల చెక్కును  ఎమ్మెల్యే కాకాణి ఆవిష్కరించారు.మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష  ఎమ్మెల్యే కాకాణి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటోలు, కార్లు  సొంతంగా నడుపుకునే యజమానులకు 10వేల రూపాయల చొప్పున కరోనా కష్టకాలంలో కూడా క్రమం తప్పకుండా 3వసారి అందించడం అభినందనీయం అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో 2,270 మంది ఆటో యజమానులకు 10,000/- ల రూపాయల చొప్పున 2 కోట్ల 27 లక్షల రూపాయల నిధులు జమ చేశామన్నారు. గత సంవత్సరం వాహనమిత్ర కింద 1,883 మందికి 1 కోటి 88 లక్షలు నిధులు విడుదల చేస్తే, ఈ దఫా అదనంగా 387 మంది అర్హత కలిగిన లబ్ధిదారులతో కలిపి 2,270 మంది ఆటో యజమానులకు వాహనమిత్ర పథకాన్ని వర్తింప చేశామన్నారు.

 

 

 

 

సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో అధికార పార్టీ శాసన సభ్యునిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 310 కోట్ల రూపాయలు కేవలం సిమెంటు రోడ్లు, సైడు డ్రైన్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గానికి తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి 36 కోట్ల రూపాయలు మంజూరు చేయించారన్నారు. తోటపల్లిగూడూరు మండలంలో 12 కోట్ల రూపాయలతో సైడు డ్రైన్లు, 15 కోట్ల రూపాయలతో అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశాం అన్నారు. తోటపల్లిగూడూరు మండలంలో తాగునీటి వసతి కల్పించేందుకు 8కోట్ల 83 లక్షల రూపాయలతో తొందరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తున్నాం అని పేర్కొన్నారు.

 

 

 

 

సర్వేపల్లి నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాల అందించడంతోపాటు, తొలివిడతలో 7,422 మందికి ఇళ్లు నిర్మిస్తున్నాం అని తెలిపారు. తోటపల్లిగూడూరు మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశం సంతృప్తికరంగా సాగిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు అధికారులు పనిచేస్తున్న తీరు ప్రశంసనీయం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సహకరించిన అధికారులందరికీ  నా ధన్యవాదాలు తెలియజేశారు.సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Commencement of YSR Vehicle Ally program on Kakani hands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *