వై ఎస్ ఆర్ సి పి రూరల్ కార్యాలయం ప్రారంభం

రాజమండ్రి ముచ్చట్లు:

 

సమిష్టి కృషితోనే త్వరలో జరగబోయే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్సిపి జెండా ఎగర వేద్దామని పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు అన్నారు.  స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోని చందన గార్డెన్స్ ఏర్పాటుచేసిన వైఎస్ఆర్సిపి రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ఆయన, మరియు మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు.   ఎమ్మెఎల్సీ  మోషన్ రాజు మాట్లాడుతూ అందరూ సమిష్టిగా రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.  అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  రైతు దినోత్సవం సందర్భంగా కడియం మండలానికి చెందిన రైతులు ను కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పార్టీ, నాయకులు సత్కరించారు.  ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు నగర అధ్యక్షుడు శ్రీనివాస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర రావు గిరజాల బాబు, జిల్లా అధికార ప్రతినిధి కానాబోయేన సాగర్, రాష్ట్ర కార్యదర్శి లు, అధ్యక్షులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Commencement of YSRCP Rural Office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *