స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కంట్రోల్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కమిషనర్ దినేష్ కుమార్

నెల్లూరు ముచ్చట్లు :
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో నిర్వహిస్తున్న కంట్రోల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యదర్శులతో సమీక్షించారు. నగరంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణను కంట్రోల్ కేంద్రం ద్వారా అనునిత్యం పర్యవేక్షించాలని, అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులకు కమిషనర్ సూచించారు. అనంతరం స్థానిక ఉమ్మారెడ్డి గుంట, వెంకటేశ్వర పురం ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు.

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Commissioner Dinesh Kumar inspected the Skill Development Center and Control Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *