జ‌ర్మ‌నీ టెక్నాల‌జితో నిర్మిస్తున్న రోడ్డును ప‌రిశీలించి క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి

Date:19/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సెక్ర‌టేరియ‌ట్ స‌మీపంలోని న‌క్లెస్ రోడ్‌లో జ‌ర్మ‌నీ టెక్నాల‌జితో ప్ర‌యోగాత్మ‌కంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నేడు ప‌రిశీలించారు. లుంబినీ పార్కు రోడ్ నుండి న‌క్లెస్‌రోడ్ ఇందిరా గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు రెండున్న కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యం కాగల రోడ్డును జ‌ర్మ‌నీ సంస్థ ఉచితంగా నిర్మిస్తోంది. 3.80 లేన్ కిలోమీట‌ర్ల మేర నిర్మిస్తున్న ఈ రోడ్డు విధానంలో ఏకోఫ్రెండ్లీగా, ప్ర‌స్తుతం ఉన్న బిటి రోడ్ మెటీరియ‌ల్ నే తిరిగి ఉప‌యోగిస్తున్నందున స‌హ‌జ వ‌న‌రుల ఉప‌యోగం కూడా పూర్తిగా త‌గ్గుతాయ‌ని, ఈ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టిన విశ్వ స‌ముద్ర ఇంజ‌నీరింగ్ కంపెనీ ప్ర‌తినిధులు జ‌ర్మ‌నీకి చెందిన వాలెన్‌టైన్, ఖైడోలు వివ‌రించారు. సిమెంట్‌లో ర‌సాయ‌న ప‌దార్థాలను క‌లిపి రూపొందించిన మిశ్ర‌మం ద్వారా స్టెబిలైజేష‌న్ రోడ్ బై రీసైక్లింగ్ విత్ ఎడిష‌న్ సిమెంట్ అండ్ అద‌ర్ కెమిక‌ల్స్ పేరుతో నిర్మిస్తున్న ఈ రోడ్డు క‌నీసం 20ఏళ్ల పాటు స్థిరంగా ఉంటుంద‌ని క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డికి వారు వివ‌రించారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌గ‌రంలోని రోడ్లు త‌ర‌చూ దెబ్బ‌తిన‌డం, దెబ్బ‌తిన్న రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తుల పేరిట తిరిగి బిటిని వేయ‌డం, దీంతో రోడ్డు ఎత్తు పెర‌గ‌డం, రోడ్లు ఎగుడు దిగుడుగా మార‌డం వంటి రోడ్లు త‌దిత‌ర ఇబ్బందుల‌ను ఈ ఆధునిక ప్ర‌క్రియతో నిర్మించే రోడ్ల ద్వారా దూర‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఈ ఆధునిక రోడ్డు నిర్మాణానికి అవుతుంది. ఒక్కో లేన్ కిలోమీట‌రుకు దాదాపు రూ. 55ల‌క్ష‌ల నుండి 65ల‌క్షల వ‌ర‌కు వ్య‌యం అవుతుందని, అయితే ఈ రోడ్డు నిర్మాణంలో వైట్‌టాపింగ్ రోడ్ల మాదిరిగానే దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల పాటు నాణ్య‌త‌తో ఉంటుంద‌ని తెలిపారు. కాగా జ‌ర్మ‌నీ టెక్నాల‌జితో నిర్మిస్తున్న ఈ రోడ్డును ఇండియ‌న్ రోడ్డు కాంగ్రెస్ ప్ర‌మాణాల‌తో ప‌రీక్షించిన అనంత‌రం క్వాలిటీ కంట్రోల్ విభాగం అందించే నివేదికల‌ను ప‌రిశీలించి ఈ మాదిరి రోడ్ల‌ను  న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ  నిర్మించే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈరోడ్ నిర్మాణ ప‌క్రియ‌ను ప‌రిశీలించడానికి కేర‌ళ రాష్ట్రానికి చెందిన రోడ్లు, భ‌వ‌నాల శాఖ చీఫ్ ఇంజ‌నీర్లు ప్ర‌భాక‌ర‌న్‌, దేవ‌రాజ్‌లు కూడా వ‌చ్చారు. దీనికు ముందు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్‌తో రోడ్డు నిర్మించే జ‌ర్మినీ బృందం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది.బీజేపీ అధిష్టానానికి రెండు ఆప్షన్లు ఇచ్చాం. మొదటిది టీడీపీ మనతో తెగదెంపులు చేసుకోకముందు మనమే పొత్తు నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మనం రాష్ట్రానికి ఏమి చేశామో చెబుదాం. రెండోది టీడీపీతో పొత్తు కొనసాగే పక్షంలో కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీని ఏపీకి తీసుకొచ్చి ఇప్పటివరకూ మనం ఇచ్చిన నిధులేంటి బహిరంగ సభ పెట్టి చెప్పాలి.  ప్రస్తుతానికి మాకు ఒక్క ఏపీలో నే మిత్రపక్షం కొనసాగుతోంది .. మిగిలిన రాష్ట్రాల్లో అన్ని పార్టీలు మాతో పొత్తు వద్దని వెళ్ళిపోయాయి. పంజాబ్ లో అకాళీదళ్ , మహరాష్ట్రలో శివసేన , ఒడిషాలో బీజేడీ లు మానుంచి విడిపోయాయి. ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం టీడీపీ .. బీజేపీని వదులుకునే అవకాశం లేదని అయన అన్నారు.
Tags: Commissioner Dr.B.Janatharan Reddy took a look at the road built by German technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *