రుణాల లబ్ధిదారులతో కమిషనర్‌ ముఖాముఖి.

Commissioner interview with loan beneficiaries

Commissioner interview with loan beneficiaries

Date:22/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

రుణాల లబ్ధిదారులతో మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ సోమవారం మున్సిపాలిటిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కాపు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ రుణాల లబ్ధిదారుల ఎంపిక, రుణాల పంపిణీపై ఆయన లబ్దిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో రుణాల మంజూరు కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులు పథకాలను సక్రమంగా నిర్వహిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. రుణాలు తీసుకున్న వారు సక్రమంగా వినియోగించుకుని, బ్యాంకులకు కంతుల వారిగా చెల్లించాలని సూచించారు. రుణాలు సక్రమంగా చెల్లించకపోతే మిగిలిన లబ్ధిదారులకు రుణాలు పొందే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకుని సక్రమమైన పద్దతులు అలవర్చుకోవాలన్నారు.

ప్రతిభా అవార్డు విద్యార్థులకు సన్మానం.

Tags; Commissioner interview with loan beneficiaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *