రైతుల వద్ద కమీషన్లు వసూలు చేయరాదు

Commissions should not be charged at farmers

Commissions should not be charged at farmers

– కార్యదర్శి ఇందుమతి

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాలమేరకు మార్కెట్‌ కమిటిలో రైతులు విక్రయించే పంటలపై ఎలాంటి కమీషన్లు , మార్కెట్‌ సెస్సు వసూలు చేయరాదని మార్కెట్‌ కమిటి కార్యదర్శి ఇందుమతి తెలిపారు. సోమవారం ఆమె మార్కెట్‌ కమిటిలో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌ కమిటిలో ఉండరాదన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈ నిర్ణయం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే వ్యాపారులు ఎవరైనా స్వచ్చంధంగా మార్కెట్‌ కమిటిలో సేవలు అందించే వారికి ఒకశాతం యూజర్‌ చార్జీ క్రింద చెల్లించాలన్నారు. మార్కెట్‌ కమిటిలో వ్యాపారులు నేరుగా రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయవచ్చునన్నారు. అలాగే ఈనామ్‌పోర్టల్‌లో ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. కమిటిలో జరిగే లావాదేవిల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా విచారణ జరిపి చట్టపరమై చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్‌ కమిటిలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

నక్కబండలో నీటి కోసం రోడ్డుపై ధర్నా

Tags; Commissions should not be charged at farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *