Date:24/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
చౌకదుకాణాల్లో నిత్యవసర వస్తువులు ఒకేసారి ఇవ్వాలని సీఐటీయు కార్యదర్శి వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో వినియోగదారులు మంగళవారం ధర్నా చేశారు. పట్టణంలోని మేలుపట్ల చౌకదుకాణంతో పాటు అన్ని చౌకదుకాణాల్లో ఒకే సారి సరుకులు ఇవ్వాలని, బయోమెట్రిక్ పనిచేసేలా చూడాలని ఆయన కోరారు. ప్రభుత్వం అందించే శెనగలు, గోదుములు, బియ్యం ఒకే సారి ఇవ్వకుండ వినియోగదారులను రోజుల తరబడి తిప్పుకుంటున్నారని తెలిపారు. ఈ కారణంగా పేద ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని , రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయమై తహశీల్ధార్ వెంకట్రాయులును విచారించగా సరుకులు ఒకే సారి పంపిణీ చేయిస్తున్నామని, బయోమెట్రిక్ సర్వర్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సరిచేస్తున్నట్లు తెలిపారు.
Tags:Commodities should be given at once