సమాజ నిర్దేశికులు ఉపాధ్యాయులే- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
సమాజ దశ, దిశ నిర్దేశికులు ఉపాధ్యాయులేనని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి పాఠశాలకు తాత్కాలిక బదిలీపై వచ్చిన ఉపాధ్యాయురాలు శైలజ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తులుగా మార్చే అవకాశం ఒక్క ఉపాధ్యాయులకే ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో విద్యాభ్యాసం అవలంభిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోదించవచ్చునన్నారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు రఘునాథయ్య పదవీ విరమణ పొందడంతో ఒక్క ఉపాధ్యాయురాలు ఉండడం విద్యా బోధన కష్టతరంగా ఉందని మండల విద్యాశాఖాధికారిణితో చెప్పడంతో వెంటనే ఆమె ఊలపాడు పాఠశాల నుంచి శైలజ ఉపాధ్యాయురాలిని ఇక్కడికి తాత్కాలిక బదిలీపై పంపించారన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధానోపాధ్యాయులు స్థానం భర్తీ కావడంతో తిరిగి శైలజను యాదస్థానానికి బదిలీ చేశారన్నారు. అయితే ఉపాధ్యాయురాలు శైలజ పని చేసిన రెండు నెలల్లోనే విద్యార్థులతో మమేకం అవుతూ చక్కని విద్యా బోధన చేసిందని ఆయన కొనియాడారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయులకే ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం ఉపాధ్యాయురాలు శైలజను దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణరెడ్డి, ఉపాధ్యాయురాలు స్వర్ణలత, సీఆర్పీ హరి, పాఠశాల కమిటీ చైర్మన్ గంగిరెడ్డి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, ఆంజప్ప, నాగరాజ, వెంకటరమణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Community Directors are Teachers- Sarpanch Srinivasureddy