డేటా అందించే కంపెనీలు పండ‌గ

Date:30/10/2020

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు:

క‌రోనా ఎంట‌ర్ అయిన ముహూర్తం ఎలాంటిదో కానీ.. అన్ని రంగాలు న‌ష్ట‌పోతే.. ఇంట‌ర్నెట్ స‌ప్ల‌య‌ర్స్ మాత్రం ఫుల్లు లాభాల్లో ఉన్నారు. డేటా అందించే కంపెనీలు పండ‌గ చేసుకుంటున్నాయి. ఎంట‌ర్ టైన్ మెంట్ నుంచి.. ఎనర్జీ గురించి తెలుసుకునే దాకా అన్నీటికీ ఇంట‌ర్నెట్టే క‌దా. అందుకే.. డేటా వాడ‌కం ఫుల్లుగా పెరిగింది. ప‌ల్లెటూళ్ల‌ల్లో కూడా ఆన్ లైన్ అంటే ఈజీగా అర్దం అవుతోంది. అందుకే.. డేటా వాడ‌కం పెరిగింది.. ఏపీ రికార్డు కొట్టింది.ఒక‌ప్పుడు వ‌న్ జీబీ టూ జీబీ డేటాతో నెలంతా గ‌డిచి పోయేది. ఇప్పుడు రోజుకి మూన్నాలుగు జీబీలు కూడా చాల‌ని వాళ్లు ఎంతోమంది. క‌రోనాకి ముందు రోజుల్లో కూడా వీక్ డేస్ లో త‌క్కువ వాడే వాళ్లు.. డైలీ ఒక‌టిన్న‌ర జీబీ వేస్ట్ అవుతుంది అని ఫీల్ అయ్యే వాళ్లు. కానీ.. క‌రోనా టైమ్ లో మాత్రం.. రోజూ డేటా అయిపోయి.. ఫోన్ ప‌క్క‌న ప‌డేయాల్సిన టైం వ‌చ్చింది. ఇక ఇప్ప‌టికీ డేటా  వాడ‌కం త‌గ్గ‌ట్లేద‌ట‌. అందుకే.. ఏపీ రికార్డులు కొట్టింది.జ‌నం ఎడ్యుకేట్ అవుతున్న కొద్దీ.. డేటా లాంటివి వాడ‌కం పెరుగుతుంది.

 

 

ఏపీలో కూడా అదే క‌నిపిస్తోంది. ఇక ఆన్ లైన్ క్లాసులు.. ఆన్ లైన్ షాపింగులు.. వీడియో కాల్సు.. ఓటీటీ సినిమాలు.. యూ ట్యూబ్ చాన‌ళ్లు అన్ని ర‌కాల ఎంట‌ర్ టైన్ మెంట్ లు డేటాతోనే న‌డుస్తున్నాయి. సో.. వాడ‌కం ఓ రేంజ్ లో పెరిగింది. ఇక స్మార్ట్ ఫోన్ల యూజ్ చేసే వారి సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరుగుతోంది. అన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయో.. బుడ్డ బుడ్డ ఫోన్లు వాడే వాళ్లు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఒక‌టీ రెండు చ‌దువుకున్న‌వాళ్లు కూడా స్మార్ట్ ఫోన్ ఆప‌రేంట్ పై ఫోక‌స్ చేసి.. ప‌నికి వెళ్తూ పాట‌లు పెట్టుకోవ‌డ‌మో.. ఖాళీగా ఉన్న‌ప్పుడు వీడియో పాట‌లు చూడ్డ‌మో చేస్తున్నారు. వాళ్ల‌నో వీళ్ల‌నో అడుగుతూ.. స్మార్ట్ ఫోన్ ని ఆడేసుకుంటున్నారు.. డేటా వాడేసుకుంటున్నారు. అందుకే.. డేటా యూజింగ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఓవ‌రాల్ గా అయితే.. క‌రోనా టైమ్ లో డేటా స‌ప్ల‌య‌ర్స్ కి ఫుల్లుగా క‌లిసొచ్చింది.

150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే

 

Tags: Companies that provide data are festive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *