Natyam ad

కారుణ్య నియామాకాలు సంగతేంటీ…

అదిలాబాద్ ముచ్చట్లు:
 
131 ఏళ్ళ చరిత్ర కలిగిన సింగరేణి పై నీలినిలడలు కమ్ముకోనున్నయా బొగ్గు.. బావుల్లో పని చేస్తున్న కార్మికులకు వయో భారం పడడంతో ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందా…… మెడికల్ ఆన్ ఫిట్  పెట్టిన కార్మికులను ఆన్ ఫిట్ చేయ్యకపోవడంతో వస్తున్న ఇబ్బందులు ఏంటి. వీటిన్నింటికి అవుననే సమాధానం వస్తోంది.131 ఏళ్ళ చరిత్ర కలిగిన సింగరేణి లో సింగరేణి కార్మికులు వయో భారం ఇప్పుడు తల నొప్పిగా మారింది. దక్షిణ భారత దేశంలోనే పెద్ద బొగ్గు గని పరిశ్రమగా విరాజిల్లుతున్న సింగరేణి ఇప్పుడు నష్టాల బాటకు సుదూరంలో ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింగరేణి వ్యాప్తంగా సుమారుగా 58 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా,అందులో 57% వరకు సింగరేణి కార్మికులు 50 సంవత్సరాలు పై బడిన వారే ఉండడమే ఇందుకు నిదర్శనం.అంతే కాకుండా 46 నుంచి 50 ఏళ్ల పై బడిన వారు 22% ఉండగా,36 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారు 14%, 18 నుంచి 35 ఏళ్ళ వయసు ఉన్న కారిమికులు 7% మంది పనిచేస్తున్నారు. బొగ్గు బావుల్లో పని చేస్తున్న యువకులు శాతం తక్కువగా ఉండడం, విరు భూగర్భ గనుల్లోకి వెళ్లి బొగ్గును తవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ఉత్పత్తి కి అంతరాయం కలుగుతోంది. అంతే కాకుండా సింగరేణి సంస్థ అంతర్గంతంగా నిర్వహిoచిన సర్వేలో ఇవి తేటతెల్లమయ్యాయి. వయసు పైబడి వారికి మోకాళ్ళ నొప్పులు, ఇతరత్రా అనారోగ్యము తో  బాదపడుతున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.  సింగరేణి సంస్థ గత కొద్ది కాలంగా మెడికల్ ఆన్ ఫిట్ బోర్డు ఏర్పాటు చెయ్యకపోవడంతో కార్మికుల్లో ఆందోళన మొదలౌతోంది. అంతే కాకుండా గతంలో మెడికల్ ఆన్ ఫిట్ కు దరఖాస్తు చేసుకున్న కార్మికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.  ఏడాది గా జీతాలు చెల్లించక పోవడంతో సింగరేణి కార్మికులు  అప్పులు చేసి మరి కుటుంబాలను పోషించుకొనే పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా  పదవి విరమణకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పదవికాలం   ఉన్న కార్మికుల  తో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న 50 ఏళ్ళు పై బడిన కార్మికులు అనేక మంది మెడికల్ ఆన్ ఫిట్ కు దరఖాస్తు చేసుకున్నారు.సింగరేణి సంస్థ నిబందనల ప్రకారం దరఖాస్తు చేసుకొని మెడికల్ అనుఫిట్ కు అర్హులైన వారందరికి సింగరేణి యాజమాన్యం వేతనాలు చెలించవల్సి ఉండగా ….
 
 
ఆరు నెలల పాటు ఆన్ ఫిట్ చేసుకున్న వారికి జీతాలను చెల్లించి, మళ్ళి ఆపి వేశారు.గత గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో సాక్షాతూ  ముఖ్య మంత్రి కెసిఆర్ కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే సి.యం. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కారుణ్య నియామకాలను కూడా బోర్డు ఆన్ ఫిట్, ఇన్ వ్యాలిడేషణ్  ద్వారా చేపట్టాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారి చేసినప్పటికీ ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి సర్క్యులర్ విడుదల చెయ్యలేదు. సింగరేణి సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడంతో కార్మికులు కష్టాలు తప్పడం లేదు. మరో వైపు ప్రతి సంవత్సరం వేలల్లో   కార్మికులు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. దీనికి తోడు కొత్తగా నియామకాలు లేకపోవడం..కారుణ్య నియామకాల ద్వారా  ఉద్యోగాలను భర్తీ చేయ్యకపోవడంతో ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతే కాకుండా 2017-2018 సంవత్సరంలో సుమారుగా 14 వేల మంది పదవి పొందాల్సి ఉంది. ఒక్క  2017  ..2018 సంవత్సరంలో  4 వేల మంది పదవిరమణ చేశారు.
 
 
 
ఈ సంవత్సరం నిర్ణయించిన 43 మిలియన్ టన్నుల ఉత్పత్తికి గాను కార్మికుల వయో భారం తో ఇప్పటి వరకు 38 మిలయన్ టన్నుల ఉత్పత్తిని మాత్రమే తియ్యగలిగారు…..రానున్న కాలం లో సింగరేణి ని ప్రైవేటి కరణ చేసే దిశగా సింగరేణి యాజమన్యం అలోచిస్తున్నందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సింగరేణి లో వృధ్యాప్యం పెరిగిపోవడం తో కార్మికులకు అనారోగ్య సమస్యలు తెల్లెతుతున్నాయి ….50 సంవత్సరాలు పై బడిన కార్మికుల సంఖ్యా ఎక్కువగా ఉండటంతో వారికీ మోకాళ్ళ నొప్పులు ..మధుమేహం …ఉపిరితిత్తుల  సమస్యలు వస్తుండటంతో కార్మికుల హాజర శాతం పై దాని ప్రభావం పడుతున్నది …..  దీనితో ఉత్పతికి ఆటకం ఏర్పడుతుందని తెలుస్తున్నది దానికి తోడి  కారుణ్య నియామకాలు జరగడం ఆలస్యం జరుగుతుండటం తో సింగరేణి సంస్థ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని కార్మిక లోకం గుస గుస పెటుకుంటున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  సింగరేణి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలనీ కార్మికులు కోరుతున్నారు
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags;  Compassionate appointments Sangatenti …

Leave A Reply

Your email address will not be published.