ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం

అధికారులకు సీఎం ఆదేశాలు

అమరావతి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగానిలుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ అధికారులు తెలియజేశారు.

 

Tags: Compensation of Rs.10 lakhs to the families of those who died in auto accidents

Leave A Reply

Your email address will not be published.