కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

పాడేరు  ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన కరోనా వ్యాధి తో చనిపోయిన తల్లిదండ్రుల వారి సంతానానికి అనాధలైన పిల్లలకు 10 లక్షల పరిహారం పధకం క్రింద బాధితులకు బాండ్లను అందచేశారు. మండలం లోని సప్పిపుట్ గ్రామం, వంతాడపల్లి గ్రామ పంచాయతీ చెందిన పాండి కాసులి (తల్లి) ,పాంగి మంజు (తండ్రి)
ఇటీవల కరోనా  వ్యాధితో మరణించగా అనాధలైన వారి ఇద్దరి  పిల్లలకు  ఒక్కొక్కరికీ మంగళవారం   10 లక్షల చొప్పున బాండులను  ఆర్డిఓ కార్యాలయం లో స్థానిక శాసన సభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ,రెవెన్యూ డివిజనల్ అధికారిణి   కె.లక్ష్మీ శివ జ్యోతి చేతులమీదుగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు, పాడేరు తాహశీల్దార్ ప్రకాశరావు , ఐసిడిఎస్ (అంగన్వాడి) సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Compensation to the families of the corona deceased

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *