అన్నీ సీట్లకు పోటీ : బీజేపీ

Competition for all seats: BJP

Competition for all seats: BJP

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో  119 సీట్ల లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఎన్నికల సంబంధించిన 32 కమిటీలు పనిచేస్తున్నాయి. అందులో  కోఆర్డినేషన్ కమిటీకి నేను చైర్మన్ గా వ్యవహరిస్తున్నానని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మ్యానిఫెస్టో కమీటీ కి న్వీఎస్ఎస్  ప్రభాకర్  చైర్మన్ గా వ్యవ హరిస్తున్నారు. ఓటర్ జాబితా నుండి లీగల్ సెల్ వరకు అన్నికమీటి లు ఇందులో ఉంటాయి.. హరీష్ రావు బీజేపీని రైతు వ్యతిరేక ప్రభుత్వం అనటం దారుణమని అన్నారు. రైతులకు సంకెళ్ళు వేసింది తెరాస  ప్రభుత్వం. తెరాస ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కల్పించలేదు. మోడీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా..4500 మంది రైతులు..ఆత్మహత్య లు చేసుకున్నారు. హరీశ్ రావు మోడీ ప్రభుత్వం పై బురద చల్లే  పనిచేస్తున్నారు. రైతు బంధు పధకం కేవలము రైతులకు ఉపసమనం లాంటిది. సొమ్ము ఒకరి దీ సోకు ఒకరిది అన్న చందంగా కేసీఆర్ పాలన సాగిందని అన్నారు. నిజమైన డ్రామా పార్టీ కాంగ్రెస్. తెలంగాణ లో ఆత్మహత్య లకు కారణం కాంగ్రెసు పార్టీనే. టీడీపి పార్టీ తెలంగాణ లో ఏవిధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ఏపీ లో అలావుంది. సీపీఎం, సీపీఐ పార్టీ లను దూరదర్శన్ లో , మైక్రో స్కోప్.. లో చూసుకోవడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. ఎంఐఎం ఆగడాలు ,అరాచకాలు,దేశ వ్యతిరేక చర్యలు చాలప్రమాదం. సీఎం రమేశ్ పై జరిగిన ఐటీ దాడులకు,  బీజేపీ కి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
Tags:Competition for all seats: BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *