గజ్వేల్ నుంచి పోటీ : గద్దర్ 

Competition from Gazelle: Gaddar

Competition from Gazelle: Gaddar

Date:08/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
నాకిప్పుడు 70 ఏళ్ళు. ఇప్పుడు నేను దేశంలో ఓటర్ నయ్యాను. ఓటును ఎలా భారత దేశంలో ఎలా వినియోగించుకోవాలని ఈసీని అడిగానని గాయాకుడు గద్దర్ అన్నారు. సోమవారం అయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసారు.తరువాత మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని 25 శాతం అమలు చేసినా బాగుండేది. ఎన్నికలు, ఓట్లుకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించానని అన్నారు. ఈసీ నాకు గైడ్ గా  సహకరించాలి. మనీ, మీడియా, మాఫియా, తొఫియా, కుఫియా అనే ఐదు అంశాలతో ఓటు ముడిపడి ఉంది.
ఇది బడా భూస్వామ్య విధానం. ఎన్నికల్లో అమెరికా సామ్రాజ్యవాద హస్తం ఉంది. ఈవీయం వచ్చిన తరువాత చాలా మార్పులు వచ్చాయని ఈసీ చెప్పారు. ఈవీఎం పై రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఈసీ చెప్పారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ నేను పుట్టిన ఊరు. గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని అనుకుంటున్నా.
దానికంటే ముందు అన్ని పార్టీల నేతలను, ప్రజలను కలిసి మాట్లాడుతానని అన్నారు. నన్ను అందరి ఉమ్మడి అభ్యర్థిగా ఉంచాలని కోరతా. సంక్షేమ పథకాలు అన్ని అందరికీ వచ్చాయా, లేదా అని ప్రశ్నిస్తా. తెలంగాణ వచ్చిన తరువాత గుణాత్మక మార్పు వచ్చిందా? పరిమాణాత్మ మార్పు వచ్చిందా అడుగుతానని అన్నారు. కేసీఆర్ ఏం చెప్పాడు? చేశాడు అని ప్రశ్నిస్తా. 31 జిల్లాల్లో మీట్ ది ప్రెస్ నిర్వహిస్తా. దసరా తరువాత ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరుస్తా. ప్రజలు కోరుకుంటే ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేస్తానని అన్నారు.
Tags:Competition from Gazelle: Gaddar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *