జలసంరక్షణపై విద్యార్థులకు పోటీలు

Competitions for Students on Water Conservation

Competitions for Students on Water Conservation

Date:17/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు శుభారాం డిగ్రీ కళాశాలలో జల సంరక్షణలో పౌరుల బాధ్యత అనే అంశంపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. మంగళవారం ప్రిన్సిపాల్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు డిఆర్‌సి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శశికళ వక్తత్వపు పోటీలు నిర్వహించారు. ఇందులో చిత్తూరు పివికెఎన్‌ పాఠశాలకు చెందిన జి.విష్ణుప్రియ ప్రధమబహుమతిని, ఆర్‌.మేనక ద్వితీయ బహుమతిని, మదనపల్లెకు చెందిన ఎం.భార్గవి తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ జలవనరులను సంరక్షించేందుకు విద్యార్థులందరు తమ ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా భూగర్భజలాలు అభివృద్ధి చెందేందుకు వీలుందన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలలకు ఎన్‌ఆర్‌ఐ సుబ్రమణ్యం విరాళం

Tags: Competitions for Students on Water Conservation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *