Natyam ad

బాలయ్య పై పిర్యాదు

హిందూపురం ముచ్చట్లు:


రాజకీయాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి హడావుడి చేస్తూండాలి ..లేకపోతే జనం మర్చిపోతూంటారు. ఈ అంశంలో సెలబ్రిటీ ప్రజాప్రతినిధులున్న చోట ఇతర పార్టీల వారికి చాలా వెసులుబాటు ఉంటుంది. కొన్ని రోజులు ప్రజాప్రతినిధి కనిపించకపోతే వెంటనే  పోలీస్ స్టేషన్‌కు వెళ్లి .. ఓ ఫిర్యాదు ఇస్తే చాలు కావాల్సినంత ప్రచారం. హిందూపురంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు అదే చేశారు.   హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని, మా సమస్యలు  ఎవరితో చెప్పుకోవాలని హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నేరుగా  కాకుండా ఈ సారి కొత్త పంధాలో వెళ్లారు. కొంత మంది  హిజ్రాలతో కంప్లైంట్లు ఇప్పించారు. వారికి మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.వీరి ఫిర్యాదు చేసిన తీరు హిందూపురంలో హాట్ టాపిక్ గా మారింది.

 

Tags: Complaint against Balayya

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.