Natyam ad

చిన జీయర్ స్వామీపై ఫిర్యాదు

నల్లగొండ ముచ్చట్లు:
 
మాంసాహారం తినే వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామి పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు మాంసాహారాలను అవమానించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రజా సంఘాలు కుల సంఘాలు అభిప్రాయపడ్డాయి. చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అశాంతి, అలజడులకు కారణం అవుతాయని వారు అన్నారు. ముఖ్యంగా ప్రజల ఆహారపు అలవాట్లుపై అనుచిత, అనాలోచిత వ్యాఖ్యలు చిన్నజీయర్ స్వామి కి సరికాదని అన్నారు… ఎస్సీ ఎస్టీల ను అవమానపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Complaint against Chin Jiyar Swami