జనసేన నేతపై ఫిర్యాదు

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో జనసేన పార్టీ నేతగా చలామణి అవుతూ జనసేన నాయకుడిని అని చెప్పి బొడ్డేపల్లి రఘు తమను బెదిరిస్తున్నారు అని విశాఖలోని ఎలక్ట్రికల్ షాప్ యజమానులు నాగేశ్వరరావు, సౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా 40 లక్షల రూపాయలకు పైగా పనులు చేపించుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తను జనసేన నాయకుడిని అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  జనసేనలో రఘు జిల్లా పదవిలో వున్నాను అని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్ తనకు అత్యంత సన్నిహితులు అని, 2024 ఎన్నికల్లో తనికి విశాఖ జిల్లా నుంచి ఎమ్యెల్యే సీట్ కంఫర్మ్ అయిందని తనకు పోలీస్ అధికారులు, రౌడి లు అండ దండలు ఉన్నాయని, డబ్బు కోసం అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బెదిరించారని తెలిపారు.

 

Tags: Complaint against Japsena leader

Leave A Reply

Your email address will not be published.