అస్సాం ముఖ్యమంత్రిపై ఫిర్యాదు

నల్గోండ ముచ్చట్లు:
 
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు  రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో సోమవారం  నల్లగొండ   టూటౌన్ పోలీస్స్టేషన్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా పున్నా కైలాశ్ నేత మాట్లాడుతూ  రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .వెంటనే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు  నిచమైన వ్యక్తిగతమైన దూషణలు చేస్తూ దేశ సంస్కృతిని  కించపరుస్తూ  దేశం కోసం బలిదానం చేసిన   కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం బిజెపి నేతలు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.  బ్రిటిష్ పాలకుల మనస్తత్వం కలిగిన బిజెపి నేతలునిజమైన దేశభక్తి కలిగిన   రాహుల్ గాంధీని కించపర్చడం బాధాకరం. .సీఎం కేసీఆర్కు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే హేమంత్  శర్మ  పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జిల్లా పల్లి పరమేష్  ఎస్సీ సెల్ చైర్మన్ ఆదిమల్ల శంకర్   నాయకులు  సుంకిరెడ్డి వెంకట్రెడ్డి యగ౦ సుజాత ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పులుసు నాగార్జునగౌడ్  నరేష్ గౌడ్ సాయిశరత్ మహేష్  నరేష్   తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Complaint against the Chief Minister of Assam

Leave A Reply

Your email address will not be published.