Natyam ad

భూ కబ్జా చేసారంటూ యాదాద్రి అధికారిపై ఫిర్యాదు

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి దేవస్థానంలో విధులు నిర్వహిస్తూ భూ కబ్జాకు పాల్పడుతున అధికారిపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని రైతు సిధారెడ్డి  కోర్టును ఆశ్రయించారు. యాదగిరిగుట్ట మండలం మల్లపురం గ్రామ (రెవెన్యూ సర్వే నెంబర్ 62) పరిధిలోని తన భూమిని కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు రైతు సిధారెడ్డి. తన భార్య పేరుపై గల 39 గుంటల భూమిలో పంట పండిస్తూ, తోట వేసి సాగుచేస్తున్న భూమిని కబ్జా చేసేందుకు వ్యవహరిస్తున్నారని ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దేవస్థానంలో పని చేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన ఈఇ ఊడెపు రామారావుపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన భూమిలో కరెంట్ స్తంభాలు నాటేందుకు ప్రయత్నించగా అధికారులకు ఫిర్యాదు చేని అడ్డుకోవడం జరిగిందని పేర్కొన్నారు. భూ కబ్జాకు పాల్పడుతూ తన భూమిలో దేవస్థానంలో పని చేసే కాంట్రాక్టర్లతో బండరాళ్ళను వేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాకు పాల్పడిన ఈయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిధారెడ్డి కోరారు.

 

Tags: Complaint against Yadadri officer for land grabbing