మీ సమస్యలను పరిష్కరించేందుకే ఫిర్యాదుబాక్సులు

Complaint boxes to fix your issues

– సీఐ నాగశేఖర్‌

Date:30/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రజలకు ఎదురైయ్యే సమస్యలను వ్రాసి ఫిర్యాదుల బాక్సులో వేయవచ్చునని , వాటిని పరిష్కరించడం జరుగుతుందని సీఐ నాగశేఖర్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని 20 ప్రాంతాలలో ముఖ్యంగా కళాశాల్లో ఈ బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముఖ్యంగా మహిళలు సమస్యలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారు ఈ బాక్సులో వేయాలన్నారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలించి, చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే పోలీసుల పనితీరు పై కూడ మీ అభిప్రాయాలను, సలహాలను ఫిర్యాదుబాక్సుల్లో వేయవచ్చునన్నారు. అలాగే పోలీస్‌ వ్యాట్సాప్‌ నెంబరు:9440900005 కు తెలపవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని, తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దీని పట్ల అవగాహన కల్పించాలని సీఐ కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ క్రిష్ణమాచారి, హెడ్‌కానిస్టేబుల్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

రైతులు డ్రిప్‌ ఇరిగేషన్‌పై అవగాహన పెంచుకోవాలి

Tags: Complaint boxes to fix your issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *